Uric Acid: అరటిపండు ఈ సమయంలో తింటే యూరిక్ యాసిడ్ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు..
మీరు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవాలంటే మందులను మాత్రమే కాదు కొన్ని రకాల ఆహారాలతో కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అరటిపండుతో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. కానీ, ఏ సమయంలో తీసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకుందాం.
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్‌ను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి. అంతేకాదు ఇందులో ప్యూరిన్, ప్రొటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందుకే అరటిపండ్లు యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నవారికి ఎంతో మంచివి. అరటిపండులో విటమిన్ సీ ఉంటుంది. ఇది రక్తంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి.
అయితే, నాలుగు అరటిపండ్లు మీ డైట్లో చేర్చుకోవాలి. వీటిని పాలు లేదా ఏదైనా షేక్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. మీరు సాయంత్రం సమయంలో కూడా వీటిని తీసుకోవచ్చు. అయితే, అరటిపండును ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ కడుపున ఉదయం లేదా రాత్రి పడుకునే సమయంలో తీసుకోవద్దు.
అరటిపండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అరటిపండులో ఐరన్ ఫోలెట్ ఉంటుంది. ఇది ఎనిమియాను కూడా నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, కెరోటెనాయిడ్స్ కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తాయి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)