Tamannaah Bhatia: నాగ సాధులా మారిన తమన్న...!.. పుర్రెల మీద నడుస్తూ స్టన్నింగ్ లుక్స్.. పిక్స్ వైరల్..
తమన్నను తెలుగులో మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. చాలా మంది హీరోలు ఈ ముద్దు గుమ్మ పక్కన నటించేందుకు మోహమాట పడుతుంటారంట. ముట్టుకుంటే.. మాసిపోయే విధంగా ఈ అమ్మడి ముఖం ఉంటుందంట.
అదే విధంగా తమన్న తెలుగులో హ్యాపీడేస్ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. 100 పర్సెంట్ లవ్, ఊపిరీ , జై లవకుశ, ఎఫ్ 3 వంటి అనేక సినిమాలో ఈ అమ్మడు నటించింది.
అయితే.. ఇటీవల ఈ అమ్మడు అనేక వెబ్ సిరిస్ లలో కూడా చేస్తున్నట్లు తెలుస్తొంది. తాజాగా... ఈ నటి ఓదెల 2 సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు.
ఓదెలా 2 మూవీ.. గతంలో చేసిన ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్గా ఉంటుందని తెలుస్తొంది. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సాలీడ్ థ్రిల్లర్ గా ఉంటుందని కూడా టాక్ నడుస్తొంది.
ఇటీవల తమన్న బర్త్ డే నేపథ్యంలో ఓదెలా 2 మూవీ పోస్టర్ ను విడుదల చేసినట్లు తెలుస్తొంది. అదేవిధంగా ఈ మూవీకి లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీలో తమన్న నాగసాధు అఘోరీలా కన్పిస్తున్నారు. ఆమె భారీగా బొట్టులు పెట్టుకుని, పుర్రెల మీద నడుచుకుంటూ ఉన్న ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఈ మూవీలో.. హెబ్బాపటేల్, మురళి శర్మలు కూడా కీలక పాత్రలలో కన్పిస్తున్నట్లు తెలుస్తొంది.