Tamannaah: సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్ కి తేడా అదే.. ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన తమన్నా..

Mon, 09 Sep 2024-10:07 pm,

మిల్కీ బ్యూటీ తమన్న తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. స్టార్ హీరోలతో ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో ఆఫర్లు అందుకుంటున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయినా స్త్రీ 2 సినిమాలో కూడా కనిపించారు తమన్నా.   

ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ కి బాలీవుడ్ కి ఉన్న డిఫరెన్స్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తన అనుభవాల ప్రకారం రెండు ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడాలు చెప్పకు వచ్చారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. సౌత్ లో సినిమాలు హిట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అని.. ఎందుకంటే చాలా వరకు సినిమాలు అక్కడికి కల్చర్, ట్రెడిషనల్ వాల్యూస్ చూపించారు విధంగా ఉంటాయని అన్నారు.  

సౌత్ లో ఉండే కథలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అని అన్నారు. చాలా వరకు సౌత్ లో వచ్చే సినిమా కథలు అన్ని వేరు వేరు వర్గాల ప్రజలను టార్గెట్ చేసి రావు. డైరెక్టర్లు తమకి బాగా తెలుసు అనుకున్న వర్గం ప్రజలను మాత్రమే లక్ష్యంగా సినిమాలు చేస్తూ ఉంటారు. 

అంతేకాకుండా సౌత్ లో సినిమాలు ఎమోషన్స్ కి వాల్యూ ఇచ్చేలాగా ఉంటాయి అని.. చాలా వరకు సినిమాలకు అదే టర్నింగ్ పాయింట్ అని అన్నారు. చెప్పే విధానం కదా మారొచ్చు కానీ చాలా వరకు సౌత్ హ్యూమన్ ఎమోషన్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ఉదాహరణకి అమ్మానాన్న అన్నా చెల్లి కోసం హ్యూమన్ ఎమోషన్స్ మీదనే కథలు రన్ అవుతాయి అని అన్నారు.  

అయితే బాలీవుడ్ లో మాత్రం డైరెక్టర్లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చేస్తారు అని.. అలా వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నా పాయింట్ డైల్యూట్ అయిపోతుంది అని అన్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే తమన్నా ఈ మధ్యనే స్త్రీ 2 సినిమాలో స్పెషల్ ఏపీరన్స్ ఇచ్చారు. ఇక త్వరలో తమన్నా ఓదెల 2 సినిమాలో నటిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link