Tamannaah: మోడ్రన్ రాధ లా మారిపోయిన తమన్నా.. ఫోటోలు వైరల్
తమన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా లీడ్రోల్ పోషిస్తూ నటించిన చిత్రం స్త్రీ 2 .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇందులో తమన్నా ఐటమ్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. కేవలం ఐదు నిమిషాలు నటించినందుకు గానూ ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అందుకొని తన రేంజ్ ఏంటో నిరూపించింది. ఇకపోతే ట్రెండుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తమన్న, త్వరలో కృష్ణాష్టమి రాబోతున్న నేపథ్యంలో మోడ్రన్ రాధ ల మారిపోయి అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రాధమ్మ మళ్ళీ వచ్చిందా అని అభిమానుల సైతం ఆశ్చర్యపోయేలా తన అందచందాలతో ఆకట్టుకుంటుంది తమన్నా.
అడవిలో కృష్ణుడితో కలిసి ఫోటోషూట్ చేసిన తమన్నా ఇప్పుడు ఆ ఫోటోలో చాలా వైరల్ గా మారుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మిల్క్ బ్యూటీ ని చూస్తే మాత్రం చూపు తిప్పుకోలేము అంతే. ఇక తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ని అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అడవిలో చెట్టు కింద కృష్ణుడి కోసం వేచి చూస్తున్నా రాధల ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఆ ఫొటో షూట్ లో తమన్నా స్కానింగ్ లుక్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు.
యువరాణిలా కనిపిస్తున్న తమన్న ఈ ఫోటోషూట్ కోసం లైట్ బ్లూ లెహంగా ధరించి పింక్ బ్లౌజులో ముస్తాబయింది. మోడ్రన్ డ్రెస్ లోనే కాదు సాంప్రదాయ దుస్తుల్లో కూడా తాను ఎంతో అందంగా కనిపించగలను అంటూ మరోసారి నిరూపించింది.
దేశమంతా సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న తరుణంలో తమన్న ఇలా రాధ లా కనిపించి అందరిని మురిపించింది. ప్రస్తుతం మోడ్రన్ రాధలా కనిపిస్తున్న తమన్నా లుక్కు అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మోడ్రన్ రాధమ్మ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తమన్న కి సంబంధించిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.