Tamannaah: ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న తమన్నా.. పిక్స్ వైరల్..

Mon, 28 Oct 2024-10:45 am,

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన యాక్టింగ్ కంటే గ్లామర్ తో ఎక్కువగా పాపులర్ అయింది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతుంది తమ్మూ. అయినా.. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తోంది తమ్మూ.

మిల్కీ బ్యూటీ  కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే అధికంగా ఉన్నాయి. అయినా.. తన గ్లామర్ ప్లస్ పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

భోళా శంకర్..

తమన్నా సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్  మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

 

సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది.

18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ ఈ యేడాది తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. దీపావళి ముందస్తు వేడుకలు అతనితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

తమన్నా ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మతో హాట్ ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అప్పటి నుంచి ఎక్కువగా అతనితోనే కనిపిస్తోంది.

 

ఈ యేడాది తమన్నా.. శ్రద్దా కపూర్.. ‘స్త్రీ 2’లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో జాన్ అబ్రహం ‘వేద’లో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link