Unstoppable with NBK: అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో తమిళ సూపర్ స్టార్.. షూటింగ్ మొదలు..!
ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా మారి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అంటూ ఒక షోని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాల్గవ సీజన్ కూడా మొదలు కాబోతోంది.అందులో భాగంగానే అక్టోబర్ 25వ తేదీన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు.
బావ బావమరుదులు కలిసి ఈ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లు కూడా వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.
ఇక మిగిలిన ఎపిసోడ్స్ ని కూడా.. షూటింగ్ చక చక పూర్తి చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తమిళ స్టార్ హీరో సూర్య జాయిన్ అయ్యారు.
ఇప్పటికే దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను కంప్లీట్ చేసిన మేకర్స్, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక ఎపిసోడ్ కూడా పూర్తి చేశారు.
ఇక ఇప్పుడు కంగువ ప్రమోషన్ లో భాగంగా సూర్య.. ఈరోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అన్ స్టాపబుల్ షోలో సూర్య కంగువ సినిమా ప్రమోషన్స్ భాగంగా.. సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇక్కడ సూర్యతోపాటు కంగువ డైరెక్టర్ శివ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.