Thanjavur Ancient Temple: ఆ ప్రాచీన ఆలయం నిర్మాణం వేయేళ్ల నుంచి రహస్యమే
ఈ ఆలయం గోపురం బరువు దాదాపుగా 88 టన్నులు. ఒకే రాయితో నిర్మించారు. గోపురం పైభాగంలో 12 అడుగుల స్వర్ణ కలశం ఉంచారు. ఇంత బరువైన గోపురం రాయిని అంతెత్తున ఎలా అమర్చారనేది మరో ప్రశ్న. ఇప్పటి వరకూ ఈ ప్రశ్నకు సమాదానం లేదు.
ఈ ఆలయంలో అమర్చిన రాళ్లను ఒకదానికొకటి జోడించేందుకు సున్నం లేదా సిమెంట్ వాడలేదు. రాళ్లకు కోణాల కింద కట్ చేసి వాటిలో అమర్చారు. ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడదని అంటారు.
ఈ ఆలయం ఎత్తు దాదాపు 667 మీటర్లు ఉంటుంది. అంటే 15 అంతస్తుల భవనానికి సమానం. ప్రతి అంతస్థు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఆలయ నిర్మాణానికి గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. మొత్తం బరువు 1.3 లక్షల టన్నులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆలయానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా గ్రానైట్ క్వారీనే లేదు. అలాంటిది అంత బరువైన గ్రానైట్ రాళ్లను ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారనేది ప్రశ్నార్ధకం.
ఈ ఆలయాన్ని నిర్మించి 1 వేయి ఏళ్లకు పైనే దాటింది. అయినా ఇప్పటి వరకూ చెక్కుచెదరలేదు. విశేషమేమంటే ఈ ఆలయానికి అసలు పునాదే లేదు. పునాది లేకుండా వేయేళ్లకు పైనే నిలబడి ఉంది. ఈ ఆలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదేశ్వరాలయం ఇది. స్థానికంగా ఈ గుడిని పెరూవుటయర్ కోవెలగా పిలుస్తారు. ఈ ఆలయం శివునిది. ఈ ఆలయాన్ని చోళ రాజైన రాజరాజ చోళుడు 1 నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం 1003-1010 సంవత్సరాల మధ్య జరిగింది.