Tata Group: టాటా గ్రూప్‌కు చెందిన ఈ 7 లగ్జరీ బ్రాండ్స్ గురించి తెలుసా
తాజ్ హోటల్స్ అనేది ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌లో భాగం. 1902లో జంషెడ్‌జీ టాటా ప్రారంభించారు. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. లగ్జరీ అకామొడేషన్, సర్వీస్ విషయంలో ప్రసిద్ధి చెందింది.
టాటా కల్ట్ ఫిట్. ఇదొక ఫిట్నెస్ కంపెనీ. గ్రూప్ ఎక్సర్‌సైజ్ చేయిస్తుంది. ఇందులో యోగా నుంచి బాక్సింగ్ వరకూ అన్నీ ఉంటాయి. టాటా గ్రూప్ ఈ స్టార్టప్‌లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసింది. కల్ట్.ఫిట్ అనేది నిపుణులైన ట్రైనర్లు, కొత్త టెక్నాలజీ సహాయంతో నడుస్తున్న సంస్థ.
టాటా జూడియో
జూడియో ట్రెంట్ లిమిటెడ్ పరిధిలోని ఫ్యాషన్ బ్రాండ్. ఇందులో ట్రెండీ, బడ్జెట్ క్లోడింగ్ ఆప్షన్లతో పాటు యువతకు నచ్చేవి చాలా ఉన్నాయి. యవతలో ప్రస్తుతం జూడియో క్రేజ్ ఎక్కువే నడుస్తోంది. తక్కువ ధరకు వస్త్రాలు లభిస్తాయి
టాటా బిగ్‌బాస్కెట్. దేశంలోని తొలి ఆన్‌లైన్ గ్రోసరీ వేదిక. 2011లో ప్రారంభమైంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. 2021లో మరో కంపెనీ ద్వారా 64 వాటాతో మొదలైంది.
టాటా స్టార్‌బక్స్. దేశవ్యాప్తంగా అద్భుతమైన కాఫీకు ఇది ప్రసిద్ధి. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌లో స్టార్‌బక్స్ ఇండియా పనిచేస్తోంది. అక్టోబర్ 2012లో లాంచ్ అయింది.
టాటా వెస్ట్‌సైడ్. దేశంలో అతి పెద్ద, అత్యంత వేగంగా విస్తరిస్తున్న రిటైల్ బ్రాండ్ ఇది. ఇందులో వస్త్రాలు, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి. టాటా 1998లో ప్రారంభించింది
టాటా జారా. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్. స్పానిష్ ఫ్యాషన్ దిగ్గజ సంస్థ ఇండిటెక్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌లో ఇది ప్రారంభమైంది. ఇండిటెక్స్ ట్రెంట్ పేరుతో నడుస్తోంది. దేశవ్యాప్తంగా 21 స్టోర్స్ ఉన్నాయి.