Tata Group Valuation: పాకిస్థాన్ దేశాన్ని నిలబెట్టి అమ్మేసినా.. టాటా గ్రూపు వాల్యూ కాలిగోటికి కూడా సరిపోదు.. దటీజ్ రతన్ టాటా

Thu, 10 Oct 2024-12:38 pm,

Tata Group Valuation: రతన్ టాటా నిష్క్రమణతో భారత కార్పొరేట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన సాధించిన విజయాలు మాత్రం చిరకాలం నిలిచి ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన టాటా గ్రూప్ సంబంధించి అత్యంత సక్సెస్ సాధించిన చైర్మన్లలో ఒకరుగా పేరు పొందారు. టాటా గ్రూప్ ఈరోజు ఉన్న స్థాయికి రతన్ టాటా కృషి ఎంతో గొప్పది అని చెప్పవచ్చు.

తన ఫ్యామిలీ జీవితాన్ని సైతం టాటా గ్రూప్ కోసం ఫణంగా పెట్టి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక వాల్యుయేషన్ ఉన్న గ్రూప్ కంపెనీలో ఒకటిగా నిలిపాడు. టాటా గ్రూప్ ఈరోజు ఏ స్థాయికి చేరిందంటే కొన్ని దేశాల జిడిపి కూడా టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ వాల్యూవేషన్ ని అందుకోలేనంత ఎత్తుకి  గ్రూప్ ఎదిగింది. 

టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్  పాకిస్తాన్ జిడిపి కంటే ఎక్కువ. ఈ ఏడాది చివరి నాటికి పాకిస్థాన్ జీడీపీ 347 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అంటే సుమారు 34 లక్షల కోట్ల రూపాయలతో సమానం. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ జూలై 2024లోనే 400 బిలియన్ డాలర్లు దాటింది.

అంటే దాదాపు 40 లక్షల కోట్ల సమీపంలో ఉంది. టాటా గ్రూప్ దేశంలోనే అతి పెద్ద వ్యాపార సమూహం, దీని సంయుక్త విలువ  400 బిలియన్ డాలర్లు దాటింది. టాటా గ్రూపు సామ్రాజ్యంలో 100కు పైగా కంపెనీలు ఉన్నాయి. గ్రూప్‌లోని 26 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి.   

ఈ ప్రయాణం 1868 సంవత్సరం నుండి ప్రారంభమైంది టాటా గ్రూప్ చాలా పాత వ్యాపార సంస్థ. ఇది 1868 సంవత్సరంలో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించబడింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ చాలా పెద్దది, దాని వ్యాపారం 6 ఖండాలలో 100 కంటే ఎక్కువ దేశాలలో విస్తరించి ఉంది. అదే సమయంలో, టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని 150 దేశాలలో ఉన్నాయి.  

ఇవి టాటా గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు టాటా గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు TCS, Tata Steel, Tata Motors, Titan Company, Tata Chemical, Tata Power, Indian Hotels Company, Tata Consumer Products, Tata Communication, Voltas Limited, Trent Limited, Tata Investment Corporation, Tata Metallics, Tata Elxsi, నెల్కో లిమిటెడ్, టాటా టెక్ మరియు రాలిస్ ఇండియా.  

10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు టాటా గ్రూప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 10,28,000. ఒక్క టాటా గ్రూప్ టీసీఎస్‌లోనే దాదాపు 6,15,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల పరంగా TCS ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link