Tata Punch : దసరాకు కొత్త కారు కొంటున్నారా? టాటా పంచ్ నుంచి కొత్త మోడల్ రిలీజ్.. ధర, ఫీచర్లు తెలిస్తే ఫిదావ్వాల్సిందే

Tue, 17 Sep 2024-6:51 pm,

2024 Tata Punch launched in India: మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. దేశంలో టాటా కంపెనీకి ఎంతో మంది కస్టమర్లు ఉన్నారు.టాటా అంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే టాటా పంచ్ కారు కూడా అత్యధికంగా ఆదఱన పొందింది. ఈ మధ్య కాలంలో ఈ కారును చాలా మంది కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

బడ్జెట్ ధరలో మంచికారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసేవారి చూపు టాటా పంచ్ వైపే మళ్లుతుంది. మీరు కూడా ఈ టాటా పంచ్  కారును కొనుగోలు చేయాలనుకుంటే సరికొత్త మోడల్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా పంచ్ కొత్త అప్ డేట్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వెర్షన్ లో యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ సెంటర్ కన్సోల్లోనే అందుబాటులో ఉంటుంది.

2024 మోడల్ టాటా పంచ్ వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే , ఆండ్రాయిడ్ ఆటో కూడిన కొత్త 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.   

ఇక టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కి వైర్‌లెస్ ఛార్జర్, బ్యాక్ ఏసీ వెంట్ వంటి సరికొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కంపెనీ తన కొత్త కారును రూ.6.12 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో కస్టమర్లకు అందిస్తోంది. మార్కెట్లో, ఈ కారు Citroen C3,  Hyundai Exter వంటి కాంపాక్ట్ SUV వాహనాలతో పోటీపడుతుంది.ఈ కారులో 10 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.అంతేకాదు వీటిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు CNG ఇంజన్ ఆప్షన్‌లో కూడా వస్తుంది.  

టాటా పంచ్ సిటీ, ఎకో అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. ఇది 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ  కారు డ్యామేజ్ అయిన రోడ్లపై కూడా సాఫీగా సేఫ్టీగా ప్రయాణిస్తుంది. అంతేకాదు ఈ కారు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. రోడ్డుపై  88 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు CNGలో 26.99 km/kg మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.   

5 స్టార్ రేటింగ్‌:  కాగా టాటా పంచ్ కూడా EV వేరియంట్‌తో వస్తుంది. ఈ కారు గ్లోబల్ NCAP సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ ను పొందింది.  ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. టాటా పంచ్ LED హెడ్‌లైట్లుచ టెయిల్‌లైట్‌తోపాటు పవర్ విండోస్, 16-అంగుళాల టైర్ సైజుతో వస్తుంది.ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ తోపాటు డ్యూయల్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link