Tata Stocks: టాటా స్టాక్స్ కొన్నారా.. అయితే జరగబోయేది ఇదే..!

Thu, 10 Oct 2024-8:48 am,

వేలమంది ఆశాదీపం నింగికెగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబైలోని బ్రిడ్జి క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.  దీంతో పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటూ వరుస పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలా ఉండగా రతన్ టాటా.. టాటా గ్రూప్స్ అధినేత మాత్రమే కాదు.. ఆ సంస్థలలో పనిచేసే ఎంతోమందికి దేవుడు కూడా.. ముఖ్యంగా ఈయన ఎన్నో సంస్థలను స్థాపించి వాటి ద్వారా మరి ఎంతమందికి ఉపాధిని కల్పించడమే కాదు అంతకుమించి చాలామందికి ఆర్థిక అండగా నిలిచారు. ఇక రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్, టేట్ కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ , బ్రన్నర్ మోన్డ్ , జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తో పాటు డేవూ వంటి ఉన్నత స్థాయి కొనుగోళ్లతో ప్రపంచీకరణ డ్రైవ్ ను కొనసాగించారు. ఆర్జెడి టాటా నుండి టాటా సన్స్ చైర్మన్ గా అలాగే టాటా ట్రస్టుల చైర్మన్ గా మార్చి 1991లో బాధ్యతలు స్వీకరించారు. 

టాటా సన్స్ టాటా కంపెనీల ప్రధాన పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ అలాగే ప్రమోటర్ కూడా.. టాటా సన్స్ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 66% విద్య , ఆరోగ్యం,  జీవనోపాధి ఉత్పత్తి అలాగే కళ సంస్కృతికి తోడ్పడే జాతృత్వ ట్రస్టులను నిర్వహించబడుతోంది. 

రతన్ టాటా డిసెంబర్ 2012లో టాటా గ్రూప్ తో 50 సంవత్సరాలు తర్వాత టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ బిరుదుతో ఆయనను సత్కరించారు.  

ఇకపోతే వీటిల్లో పెట్టుబడులు పెట్టి స్టాక్స్ కొన్నవారికి జరగబోయేది ఇదే అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇకపోతే 2024 లో టాటా కంపెనీల ఆదాయం మొత్తం 165 డాలర్ బిలియన్లకు పైగా ఉంది. ఈ కంపెనీలు ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. మొత్తం 26 పబ్లిక్ లిస్టెడ్ టాటా ఎంటర్ప్రైజెస్ 2024 మార్చి 31 నాటికి 365 డాలర్ బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను కలిగి ఉన్నాయి.

ఇకపోతే రతన్ టాటా మరణం తర్వాత ఆయనకు వివాహం జరగలేదు. వారతులు లేరు కాబట్టి ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు.. అందులో స్టాక్స్ కొన్న వారి పరిస్థితి ఏంటి.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయా గ్రూపులకు సంబంధించి అధినేతలు వారి బంధువులు ఇక్కడ అధికారంలోకి రాబోతున్నారని, కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎటువంటి తప్పిదాలు దొరలవు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link