Tata Altroz Vs Tata Tiago: టాటాలో ఈ కార్లు కొనుగోలు చేస్తున్నారా? వీటిల్లో ఇదే చాలా బెస్ట్!
టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ రెండు కార్లలో అనేక తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ రెండు కార్ల ధర విషయానికొస్తే, టాటా టియాగో రూ.5.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాటా ఆల్ట్రోజ్ కేవలం రూ.6.65 లక్షలోపే లభిస్తోంది. కాబట్టి ధర పరంగా చూస్తే టాటా టియాగో చాలా తక్కువేనని తెలుస్తోంది.
ఇక ఈ రెండు కార్ల పరిమాణాల వివరాల్లోకి వెళితే, టాటా ఆల్ట్రోజ్ కారు కాస్త పెద్దది, లోపల ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. టాటా టియాగో నాలుగుగురికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పరిమాణం విషయంలో మాత్రం టాటా ఆల్ట్రోజ్ గొప్ప ఎంపిగా భావించవచ్చు.
ఈ రెండు కార్ల ఫీచర్స్ సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాటా ఆల్ట్రోజ్‌లోని హై ఎండ్ కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కానీ టియాగో మాత్రం చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి.
టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ వివరాల్లోకి వెళితే..రెండు కార్లు 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో-చార్జ్డ్ డీజిల్ ఇంజన్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. మైలేజ్ కూడా ఈ రెండు కార్లు 19 నుంచి 20 kmpl వరకు ఇస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో మంచి మంచి కారు కొనుగోలు చేయాలనుకునేవారికి టాటా టియాగో చాలా బెస్ట్, ఎక్కువ పరిమాణం, ఎక్కువ స్పెస్ కావాలనుకునేవారు టాటా ఆల్ట్రోజ్ మంచి ఎంపిగా భావించవచ్చు. అంతేకాకుండా ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా కూడా టాటా ఆల్ట్రోజ్ చాలా బెస్ట్.