Rohit Sharma: ప్రపంచ రికార్డుకు కూతవేటు దూరంలో రోహిత్ శర్మ, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సాధించేనా
టీమ్ ఇండియా గత 10 ఏళ్లలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోపీని 2013లో సాధించింది. 2011లో దోనీ నేతృత్వంలోనే వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి ఇండియా ఫామ్ చూస్తుంటే కచ్చితంగా ప్రపంచకప్ సాదిస్తుందన్పిస్తుంది.
రోహిత్ శర్మ నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌పై 5 సిక్సర్లు కొట్టడం అంత కష్టమైందేమీ కాదు.
రోహిత్ శర్మ ప్రపంచకప్ చరిత్రలో అందరికంటే అత్యధిక సిక్సర్లు సాధించే క్రికెటర్‌గా రికార్డు సృష్టించవచ్చు. ఆ రికార్డుకు కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో అందరికంటే ముందు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఉన్నాడు. ఇప్పటి వరకూ 49 సిక్సర్లు సాధిస్తే రోహిత్ శర్మ 45 చేశాడు.
రోహిత్ శర్మ ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లలో సరాసరిన 55 పరుగులకు పైనే సాధించాడు. మొత్తం 442 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ టోర్నీలో ఎక్కువ రన్స్ సాధించిన బ్యాటర్లలో 5వ స్థానంలో ఉన్నాడు.