Team India Head Coach: టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులో ఐదుగురు టాప్ క్రికెటర్లు, ఎవరెవరంటే

Tue, 14 May 2024-8:41 pm,

జస్టిన్ ల్యాంగర్

యాషెస్, టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్న ల్యాంగర్ మంచి వ్యూహకర్త. టీమ్ ఇండియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని ఉందని ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇతనిని కూడా రేసులో నిలిపాయి. 

ఆండీ ఫ్లవర్

బీసీసీఐ విదేశీ కోచ్ కోసం చూస్తే మాత్రం జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ మంచి ఆప్షన్ కావచ్చు. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆర్సీబీ ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుపర్చుకుంది.

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రెండోసారి రాహుల్ ద్రావిడ్ విజ్ఞప్తి చేయకుంటే ఆ స్థానానికి వీవీఎస్ లక్ష్మణ్ అన్నివిధాలుగా అర్హుడౌతాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా అభిప్రాయం ప్రకారం అన్ని ఫార్మట్ మ్యాచ్‌లకు ఒకే కోచ్ ఉండవచ్చు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తరువాత ద్రావిడ్ పదవీకాలం ముగుస్తుంది. మే 27 వరకూ ఈ పదవి కోసం పోటీపడేవారు అప్లై చేసుకోవచ్చు. 

వీవీఎస్ లక్ష్మణ్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి వీవీఎస్ లక్ష్మణ్ అన్నివిధాలుగా అర్హుడు. 49 ఏళ్ల లక్ష్మణ్ మూడేళ్ల నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీఫ్‌గా ఉన్నాడు. భారతీయ క్రికెటర్లలో అప్ కమింగ్ జనరేషన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. ద్రావిడ్ స్థానంలో హెడ్‌గా బాద్యతలు నిర్వహించాడు. లక్ష్మణ్ కోచ్‌గా ఉండగా ఆసియా క్రీడలు, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఐర్లండ్ సీరీస్‌లు జరిగాయి.

వీరేంద్ర సెహ్వాగ్

టీమ్ ఇండియా మాజీ ప్రముఖ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో బెస్ట్ ఆప్షన్. వీరేంద్ర సెహ్వాహ్ దూకుడుగా ఆడే స్వభావమున్న ఆటగాడు. 

గౌతమ్ గంభీర్

క్రికెట్‌లో ప్రతి ఫార్మట్‌లో అనుభవమున్న ఢిల్లీ బ్యాటర్. కేకేఆర్ టీమ్ కెప్టెన్‌గా రెండు సార్లు టైటిల్ గెలవడం, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్‌గా రెండు సార్లు ప్లేఆఫ్‌కు చేర్చడంలో కీలకపాత్ర ఉంది. తిరిగి కేకేఆర్ కోచ్‌గా ఐపీఎల్‌లో జట్టు రాణిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link