Tecno Phantom V Fold 2 Price: వారేవా.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Tecno నుంచి ఫోల్డ్ 2.. ఫీచర్స్‌ ఇవే!

Fri, 18 Oct 2024-3:50 pm,

ఈ టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 (Tecno Phantom V Fold 2) ఫోల్డబుల్ ఫోన్‌ను కంపెనీ మొదట భారత్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బోలెడు ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.   

ఈ ఫోల్డబుల్‌ మొబైల్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆఫ్రికాలో ప్రకటించింది. అయితే అక్కడ దీని ధర రూ.92,400 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే భారత్‌లో లాంచ్‌ అయితే భారత్‌లో లాంచ్‌  అయినా ఇదే ధరకే లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.  

ఇక ఈ మొబైల్‌ వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే కంపెనీ దీనినిపై అధికారికి ప్రకటన ఇంకా చేయలేదు. ఇది మాత్రం మూడు కలర్‌ ఆప్షన్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.42-అంగుళాల పూర్తి HD+ AMOLED LTPO ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2550x1080 పిక్సెల్ రిజల్యూషన్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది.

అలాగే ఈ మొబైల్‌ ప్రధాన డిస్ల్పే 2296x2000 పిక్సెల్ రిజల్యూషన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. రెండవ స్క్రీన్‌ మాత్రం 7.85-అంగుళాల 2K+ AMOLED LTPO డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. 

ఇక ఈ ఫోల్డ్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది 32-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా లభిస్తోంది. వీటితో పాటు అదనంగా  2x జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ కెమెరా కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇక ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన  డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 12GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోంది. ఇది 5750mAh బ్యాటరీ సెటప్‌తో రానుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link