Tecno Pova 5 Pro Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ కలిగిన 5G స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 800లకే!

Fri, 25 Aug 2023-5:15 pm,

ప్రస్తుతం ఈ Tecno Pova 5 Pro 5G అమెజాన్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదట కంపెనీ 8GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ విడుదల చేసింది. అమెజాన్‌ ఈ వేరియంట్‌ మొబైల్‌ను రూ. 15,999లకు విక్రయిస్తోంది.    

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మొదట కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను రూ. 16,990లకు విడుదల చేసింది. అయితే అమెజాన్‌ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 15,999 అందిస్తోంది.  

అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5G మొబైల్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో బిల్‌ చెల్లిస్తే రూ. 1,250 వరకు తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 14,749లకే లభిస్తుంది. 

ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరలో పొందడానికి అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి రూ.15,199 వరకు బోసన్‌ పొందవచ్చు. దీంతో మీకు ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 800లకే పొందవచ్చు. 

Tecno Pova 5 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌  6.78 అంగుళాల ఫుల్ HD ప్లస్ డాట్ ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌  120 రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ కలిగి ఉంటుంది.  దీంతో పాటు 68W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌,  5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link