KCR-Akhilesh Meet: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్, ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ప్రత్యేక భేటీ దృశ్యాలు
కేసీఆర్ నివాసానికి వచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికి..శాలువతో సత్కరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. మరోవైపు ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర శక్తి అధికారంలో రావాలని..ఎస్పీ, టీఆర్ఎస్ పార్టీలు భేటీలో చర్చించాయి. ఈ అంశంపైనే కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మధ్య ప్రధానంగా చర్చ సాగింది.
ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో ప్రత్యేక భేటీ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో జాతీయ రాజకీయాలపై భేటీ ప్రారంభమైంది.
జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇటీవల కొద్దికాలంగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై ఆరోపణలు తీవ్రం చేసిన కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.