Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..
Indiramma Illu: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది కావొస్తోన్న హామిలు అమలులో వెనబడే ఉంది.ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగిలిన హామిలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు రైతు రుణమాఫీ అంటూ కొంత మంది రైతులకే లబ్ది చూకూరింది. చాలా మంది అర్హులైన రైతులకు రుణ మాఫీ కాలేదు. ఈ విషయమై తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు.
మరోవైపు గృహ జ్యోతి పథకం కూడా కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే అనే లింకు పెట్టారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు వచ్చినప్పటి నుంచి కొత్త పెళ్లైన దంపతులెవరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.
ఎంతో మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసి ఉన్నారు. ఇప్పటికీ వాటిపై క్లారిటీ లేదు. అందులో ఎంతో మంది అర్హులైన పేదలున్నారు. వారికీ గృహ జ్యోతి పథకం అందడం లేదనే చెప్పాలి.
మరోవైపు గృహ లక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు రూ. 2 వేలు అంటూ ఊదరగొట్టినా.. ఇప్పటికీ దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. మరోవైపు కేసీఆర్ సర్కారు.. కేంద్రంలో మోడీ సర్కార్ ఇచ్చిన నిధులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన ఇళ్లను ఇప్పటికీ పేదలకు ఇవ్వలేదు.
తాజాగా తెలంగాణ సర్కారు పేదలకు దీపావళి కానుక ఇవ్వబోతుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజు అమావాస్య కాబట్టి.. ఆ తర్వాత కార్తీకంలో మంచిరోజు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించనుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది.