Revanth Reddy: సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు.. గణేష్ ఉత్సవాల వేళ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డులు.. డిటెయిల్స్..

Wed, 18 Sep 2024-2:40 pm,

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలుత నుంచి తనదైన శైలీలో పాలనలో స్పీడ్ ను పెంచారు. ఒకవైపు తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందించేందుకు పాటుపడుతూనే, మరోవైపు బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. 

కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయం ఇచ్చిన ఆరుగ్యారంటీల పథకం అమలుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత పథకంను పైలేట్ ప్రాజెక్ట్ గా రేవంత్ సర్కారు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ప్రజల నుంచి కూడా ఉచిత బస్సుల విషయంలో మంచి రెస్పాన్స్ సైతం వస్తుంది.   

ఇక వైపు తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పదేళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పడమే కాకుండా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందుంచుతున్నారు. గత ప్రభుత్వంలో తొత్తులుగా పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

తెలంగాణను ఇచ్చిన పార్టీగా.. తమను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని కూడా సీఎం రేవంత్ అనేక సమావేశాల్లో చెప్పుకొచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి, గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లిన వారు.. మరల కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరిపోయారు. మరోవైపు తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గణేష్ ఉత్సవాలను ఎంతో వైభంగా నిర్వహించేలా అధికారుల్ని ఆదేశించారు.

ముఖ్యంగా హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా పకట్భందీ చర్యలు తీసుకొవాలని కలెక్టర్ లు, జీహెచ్ఎంసీ, సిటీ పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి,ఎక్కడ కూడా పొరపాట్లు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. ఒకవైపు ఇటీవల భారీ వర్షాలు పడిన కూడా నిరంతరం ప్రజా సమస్యల్ని తీర్చడానికి తనవంతుగా మంత్రులు, అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించారు.  

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజను నిర్వహించి అరుదైన ఘనత సాధించారు. ఈసారి 70 అడుగులో ఎత్తులో ఖైరతాబాగ్ గణపయ్యను ప్రతిష్టించారు. ఇక్కడ గతంలో తొలిపూజను ... తెలంగాణ గవర్నర్ లు నిర్వహించేవారు. కానీ ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిభావనలో, ఉత్సవాలను జరుపుకొవాలని సూచించారు.  

అదే విధంగా చివరకు నిమజ్జనంలో కూడా.. సీఎంగా ఏకంగా రంగంలోకి దిగి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో వెళ్లి.. భక్తులతో మాట్లాడారు. ఎక్కడ కూడా గణపయ్య నిమజ్జనం సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. చెప్పడమేకాకుండా.. క్షేత్రస్థాయి వెళ్లి.. మంత్రులు, అధికారుల్ని సైతం పరుగులు పెట్టించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మనవడు.. చేసిన డ్యాన్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

నిమజ్జనం సమయంలో సీఎం రేవంత్ ను చూసిన ప్రజలు సైతం ఆనందంతో పొంగిపోయారు. అంతేకాకుండా.. సచివాలయం ముందు ఐటీ విప్లవంకు నాంది పలికిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాం సైతం ఆవిష్కరణ చేశారు. అపోసిషన్ పార్టీలకు గట్టిగా కౌంటర్ లు ఇస్తూ.. తెలంగాణలో పాలనలనో సీఎం రేవంత్ దూసుకుపోతున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link