Employees Salary Hike: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. భారీగా జీతాల పెంపు..
Telangana Govt: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలకు, ఉద్యోగాలకు తాయిలాలు ఇచ్చే పనిలో పడింది.
ఈ నేపథ్యంలో ముందుగా పంచాయితీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ గా జీతా భత్యాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆ శాఖ మంత్రి సీతక్క.
ఆన్ లైన్ లో ఒకేసారి అందరికీ జీతాలు పడేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు పడనున్నాయి.
దీనికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. ఆర్ధిక శాఖ క్లియరెన్స్ తర్వాత ఈ శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జీతాలు 1వ తారీఖున అకౌంట్ లో పడతాయి. దీంతో ఈ సంస్థలో పనిచేస్తోన్న 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఇప్పటికే విద్యుత్ సహా కొన్ని శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే తరహాలో జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో ఎలాంటి కాంట్రాక్టర్లు లేకుండా నేరుగా జీతాలు పడతాయి. దీంతో ప్రభుత్వంపై భారీ కూడా తగ్గే అవకాశాలున్నాయి.