Electricity Prices Hike: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు.. బాంబ్ పేల్చిన తెలంగాణ సర్కార్

నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారుల ఫిక్సెడ్ ఛార్జీలపై స్వల్ప పెంపు ప్రతిపాదించామన్నారు.

సంస్థ పరిధిలో గరిష్ఠ డిమాండ్ 9910 మెగా వాట్లకు చేరిందని.. రాష్ట్ర పరిధిలో 15623 మెగా వాట్లకు చేరిందని ఆయన తెలిపారు.

పంపిణీ నష్టాలను 4.75 శాతానికి తగ్గించామని.. AT & C నష్టాలను 19.03 శాతానికి తగ్గించామన్నారు.
రూ.1.08 గా ఉన్న ACS - ARR గ్యాప్‌ను రూ.0.81 శాతానికి తగ్గించామని.. ప్రతి యూనిట్‌కు రూ.6.45 స్పెసిఫిక్ రెవెన్యూ వస్తుందన్నారు.
మెంటేనెన్స్ రిపేర్ పనుల్లో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో TGAIMS యాప్‌ను రూపొందించామని ముషరఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.