Telangana Weather Update: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడివాతావరణం, వడగాల్పులు..
కొన్నిరోజులుగా ఎండగలు దంచికొడుతున్నాయి. ప్రజలంతా ఉక్కపోతతో బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అవసరమైన తప్ప అస్సలు బైటకు వెళ్లకూడదని ఇప్పటికే నిపుణులు సైతం సూచనలు జారీచేశారు.
ఇక తెలంగాణాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఉదయం పది అయ్యిందంటే చాలు.. ప్రజల్ని చెమటలు కక్కించేస్తున్నాడు.భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో చాలా మంది డీహైడ్రేషన్ ప్రభావానికి గురై, వడదెబ్బకు కూడా గురౌతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రాగలమూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండనుందో తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీచేసింది. రాగల మూడు రోజుల్లో.. వేడిగా ఉంటు పొడివాతావణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
పొడితావరణంతో పాటు బలమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ ఒకప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవరసమైతేనే బైటకు వెళ్లాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకొవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రజలు ముఖ్యంగా బైటకు వెళ్లినప్పుడు ఎక్కువగా నీళ్లను తాగడం, ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకొవడం, గొడుగు లేదా టోపీలను వాడాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకొవాలంటూ కూడా నిపుణులు చెబుతున్నారు.