TGPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ..
తెలంగాణలో కొన్నిరోజులుగా నిరుద్యోగులు గ్రూప్ ఎగ్జామ్ కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ తాజాగా, మరోసారి కొత్తగా షెడ్యూల్ ను ప్రకటించింది. మారిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ ఎగ్జామ్ లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఈ ఎగ్జామ్ లకు గాను ఆగస్టు 7,8 తేదీలను ప్రకటించారు. కానీ డీఎస్సీ, గ్రూప్ 2 లు వారంపాటు గ్యాప్ లోనే షెడ్యూల్ ఉండటంతో.. వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు తమన నిరసనలు తెలిపారు. ఈక్రమంలో దీనిపై గతంలోనే టీజీపీఎస్సీ దీనిపై రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది.
తాజాగా, ఎగ్జామ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. మొత్తం పోస్టులు 783 కు గాను.. గ్రూప్ 2 కు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. రెండు సెషన్లలలో ఎగ్జామ్ లను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మరో సెషన్ ఉంటుందని కూడా టీజీపీఎస్సీ కమిషన్ స్పష్టం చేసింది.
అదే విధంగా అభ్యర్థులు వారంముందు రోజుల నుంచి ఎగ్జామ్ హల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రూప్స్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కొన్నిరోజులుగా తెలంగాణలో గ్రూప్స్ అభ్యర్థులు కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు.ఇప్పటికే ఈ ఎగ్జామ్ లను పలుమార్లు అనేక కారణాల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. దీంతో ప్రస్తుతం అభ్యర్థులు కొత్తగా కమిషన్ తేదీలను ప్రకటించడంతో.. నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.