Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి అధికారులకు ఇంటింటికి సర్వేలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా.. సామాజిక, ఆర్థిక, విద్య, కులాలు, ఉపాధి అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
సర్వేలో దాదాపు.. 75 ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మెయిన్ గా 56 ప్రశ్నలు ఉండగా.. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయని సమాచారం.
అదే విధంగా ఈ ప్రశ్నలు రెండు పార్టులుగా ఉంటాయి. పార్టు-1లో.. కుటుంబ యజమాని పేరు,ప్యామీ సభ్యులు వ్యక్తిగత వివరాలు, ఎక్కడ చదువుకున్నారు. భూములు, రిజర్వేషన్లు, రాజకీయాల్లో పోటీ చేశారో అన్న విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి.
పార్టు-2లో .. దీనిలో మొత్తంగా 17 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 7 ప్రధాన ప్రశ్నలు కాగా, మిగతావి అనుబంధ ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. భూములు వివరాలు.. ధరణిలో నమోదైన పట్టానంబర్, భూములు ఎలా సంక్రమించాయి వంటి అంశాలు ఉంటాయి.
విద్య, జాబ్ లు రిజర్వేషన్ లు, ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏమైన లబ్ధిపొందారా అన్న వివరాలు ఉంటాయి. గతంలో రాజకీయల్లో పోటీకీ దిగారా అన్న అంశాలు కూడా ఉంటాయి.
ఇతర దేశాలకు వెళ్లారా.. ఉద్యోగం మొదలైన వివరాలు కూడా ఉంటాయంట. సర్వేల సమయంలో ఫొటోలు, పత్రాలు తీసుకోరు. కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న సమాచారం గోప్యంగా ఉంచుతారు.
పెళ్లి, దివ్యాంగులు, పశుసంపద, రేషన్ కార్డులు, తాగునీరు మొదలైన అంశాలు దీనిలో ఉంటాయని తెలుస్తోంది. ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రభుత్వం కుటుంబం వారి పరిస్థితుల గురించి సర్కారుకు ఒక అవగాహనకై ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది.