Seerat Kapoor Latest Pics: చక్కమన్న చిక్కినా అందమే.. సీరత్ కపూర్ బాగుందిగా!!
సీరత్ కపూర్ తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్సులో ఫోటో షూట్ చేశారు. ఇందులో చక్కమన్న చిక్కినా అందంగానే ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో సీరత్ కపూర్ 'సైజ్ జీరో'కు మారిపోయారు. అంతకుముందు కాస్త బొద్దుగా ఉండే సీరత్.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయారు.
కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా వంటి ఓటీటీ సినిమాలలో కూడా సీరత్ కపూర్ నటించారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు.
రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీరత్ కపూర్.. ఆ తర్వాత రాజుగారి గది-2, టైగర్, కొలంబస్, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో నటించారు. అయితే ఆ సినిమాలు ఆమెకు ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు.
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రంతో సీరత్ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శర్వా సరసన నటించిన ఆమె మంచి మార్కులే కొట్టేశారు. ముఖ్యంగా 'బుజ్జి మా.. బుజ్జి మా' సాంగ్ ఆమెకు మంచి పేరు వచ్చింది.