TG Number Plates: తెలంగాణ వాహనదారులకు బిగ్ అప్డేట్.. TGగా నెంబర్ ప్లేట్ మార్చితే లైసెన్స్ క్యాన్సిల్..

Sun, 20 Oct 2024-4:23 pm,

తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ కీ అప్డేట్ ని అందించింది.. అయితే ఇటీవల తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి సంబంధించిన వాహనాల నెంబర్ ప్లేట్ కోడ్ సిరీస్ ను TS నుంచి TG మార్చింది. ఇప్పటికే ఈ మార్పునకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లపై టీజీ వస్తుంది  

ఇటీవల చాలామంది ఈ నెంబర్ ప్లేట్ల కోడ్ మార్పులను గమనించి వారి పాత వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ గుర్తించినట్లు వెల్లడించింది. ఇలా నెంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తున్న వారికి రాష్ట్ర రవాణా శాఖ హెచ్చరించింది. ఇలా నెంబర్ ప్లేట్లు మార్చిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.  

చాలామంది వారికి తెలియకుండానే.. వారి బైకులు, కార్లకు సంబంధించిన టీఎస్ గా ఉన్న నెంబర్ ప్లేట్లను టీజీగా మారిపించుకుంటున్నారు.. అయితే దీనిని గమనించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ తాజాగా స్పందించింది. మున్ముందు ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.  

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖ సంబంధించిన అధికారులకు కీలక విషయాలని తెలిపింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో అప్పటి నుంచే వచ్చే వాహనాలకు టీజీ నెంబర్ వర్తిస్తుందని వారి అధికారులకు సూచించింది. ఎవరైనా పాత వాహనాలపై కూడా TG గా కోడ్ ని మార్చితే టాంపరింగ్ గా భావించి లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2014 సంవత్సరంలో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పటి కెసిఆర్ సర్కార్ వాహన నెంబర్ ప్లేట్ల తో పాటు సంస్థలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కోడ్లను తెలంగాణ స్టేట్(TS) గా పెట్టాలని నిర్ణయించింది. ఇక అప్పటి నుంచి అన్ని వాహనాల నెంబర్ ప్లేట్స్ లో AP కి బదులుగా TS రావడం ప్రారంభమైంది.  

ఇటీవలే జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వం పెట్టిన TS కోడ్ను రద్దుచేసి.. TG గా మార్చింది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఆమోదించింది. దీంతో అప్పటినుంచి అన్ని వాహనాలపై TS కి బదులుగా TG రావడం ప్రారంభమయ్యింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link