TGPSC Groups 2: గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ లపై కీలక ప్రకటన చేసిన టీజీపీఎస్సీ..
తెలంగాణలో చాలా మంది కొన్నేళ్లుగా సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ల కొసం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో గత సర్కారు హయాంలో గ్రూప్ ఎగ్జామ్ లు పలు మార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజాగా, రేవంత్ సర్కారు మాత్రం గ్రూప్ ఎగ్జామ్ లను పకట్బందీ చర్యలు చేపట్టింది. ఎక్కడ కూడా ఎగ్జామ్ ల నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ ౩ ఎగ్జామ్ లు ఇటీవల ముగిశాయి.
ఇటీవల జరిగిన గ్రూప్ ౩ ఎగ్జామ్ లలో దాదాపు సగం మంది అభ్యర్థులు ఎగ్జామ్ కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ కు అప్లై చేసేందుకు చూపిస్తున్న.. ఆసక్తి... రాయడంలో సీరియస్ గా అటెంప్ట్ చేయడంలో చూపించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో మళ్లీ టీజీపీఎస్సీ గతంలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాదాపు.. 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది. డిసెంబరు 15,16 తేదీలలో ఎగ్జామ్ లు జరగనున్నాయి.
అయితే.. ఈ ఎగ్జామ్ కు గాను.. డిసెంబరు 9 నుంచి హల్ టికెట్లను అధికారిక సైట్లో నుంచి డౌన్ లోడ్ చేసుకొవచ్చని కూడా టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎగ్జామ్ లు జరగనున్నట్లు తెలుస్తొంది. ఈ ఎగ్జామ్ కు గాను.. 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.