TGSRTC Buses: సంక్రాంతికి స్పెషల్ బస్సుల సమాచారం.. ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు..!
సంక్రాంతి ఫెస్టివల్‌కు 6432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా.. ప్రత్యేక బస్సులను అందుబాటులో తీసుకువస్తోంది.
అదేవిధంగా ఈ నెల 19, 20వ తేదీల్లో తిరుగు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల రద్దీకి తగినవిధంగా స్పెషల్ బస్సులను నడపనుంది.
హైదరాబాద్ లో MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, LB నగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ప్రారంభమవుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి, మొబైల్ టాయిలెట్లను టీజీఎస్‌ఆర్‌టీసీ సిద్ధం చేస్తోంది.
స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించింది. ప్రభుత్వ జీవో ప్రకారం 1.50 వరకు టికెట్ ధరలను పెంచుకోవచ్చు. అయితే రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.
సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సుల్లో ముందస్తుగా టికెట్లను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని కోరారు.