Sports bikes prices: తక్కువ ధరలో..అద్భుతమైన స్పోర్ట్స్ బైక్‌లు..ఎంతో తెలిస్తే ఆశ్చర్యమే
జపాన్ కంపెనీ యమహా అంటే ఇండియాలో బైక్ లవర్స్‌కు చాలా మక్కువ. Yamaha FZS V3 ABS ఓ అద్బుతమైన స్పోర్ట్స్ బైక్. అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే రూపం కారణంగా బైక్ లవర్స్ ఈ బైక్‌ను చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. Yamaha FZS V3 ABS లో మీకు 149 CC సింగిల్ సిలెండర్ ఇంజన్ వస్తుంది. రాజధాని ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 97 వేల రూపాయలు మాత్రమే..
టీవీఎస్ అపాచీ మార్కెట్‌లో కొత్త బ్రాండ్ కాకపోయినా..కొద్దికాలం క్రితం లాంచ్ చేసిన TVS Apache RTR 200 4V లుక్ మాత్రం జనాన్ని ఫిదా చేసేసింది. ఈ పవర్ ఫుల్ బైక్‌లో మీకు 197.75 CC సింగిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ బైక్ 3.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 97 వేల 6 వందల రూపాయలు..
జపాన్ కంపెనీ సుజుకీ కూడా స్పోర్ట్స్ బైక్ తయారీలో ముందుంటుంది. Suzuki Gixxer సిరీస్ లోని ఈ బైక్ మీకు 155 CC సింగిల్ సిలెండర్ ఇంజన్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 88 వేల 9 వందల రూాపాయలు మాత్రమే..
స్పోర్ట్స్ బైక్ గురించి మాట్లాడేటప్పుడు..బజాజ్ పల్సార్ పేరు ప్రస్తావించకపోతే ఎలా ఉంటుంది..స్పోర్ట్స్ బైక్ శ్రేణిలో Bajaj Pulsar 220F దేనికంటేనూ తీసిపోలేదు. ఈ బ్రాండ్ ఎంత పాపులర్ అయ్యిందంటే...పల్సార్ పేరుతోనే బైక్స్ అమ్ముడైపోతున్నాయి. Bajaj Pulsar 220F లో గొప్ప విషయమేమంటే..మీకిందులో 220 సిసి పవర్ ఫుల్ ఇంజన్ లభిస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర లక్ష రూపాయలు..