Crazy Heroine: మాజీ సీఎం ఫ్యామిలీకే హ్యాండ్ ఇచ్చిన క్రేజీ తెలుగు హీరోయిన్.. ఇంతకీ ఎవరంటే..!

Fri, 23 Aug 2024-3:41 pm,

మెహ్రీన్ కౌర్ మోడలింగ్: మెహ్రీన్ కౌర్ మోడలింగ్ ఫీల్డ్ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది.

మెహ్రీన్ కౌర్: ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్న కథానాయికల్లో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

రాజా ది గ్రేట్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

F2: ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరిని ప్రేక్షకులు యాది మరవలేదు. 

ఎంగేజ్మెంట్: అప్పట్లో హర్యాణ మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది.ఆ తర్వాత అది పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. వీరిద్దరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని మాత్రం బయటకు రాలేదు. 

F3: మెహ్రీన్ కౌర్ నటించిన ఎఫ్ 3 సక్సెస్ అయినా.. అమ్మడికి మాత్రం పెద్దగా ఒరిగిందేమి లేదు. అందుకే సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. అందుకు అందాలను ఎరగా వేస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link