Property Tax: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఇకపై ప్రతినెల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిందే

Sun, 15 Sep 2024-2:31 pm,

Property Tax Every Month in Telangana: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గురిచేసేలా ఉంది. ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సరళం చేయడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణకోసం ప్రభుత్వం రెడీ అయ్యింది.  

 దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరిగానే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా నెలవారీగా వసూలు చేయడం, పన్ను విలువను వాస్తవీకరణ చేయడం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు.   

హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలలకోసారి ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికోసారి చెల్లిస్తుంటారు. పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ చట్టంలోని ఆ నిబంధనలను సవరించి నెలకోసారి ఆస్తి పన్ను విధించాలనే ఆలోచన అధికార వర్గాల్లో ఉన్నట్లు సమాచారం.   

రోజువారీ చేపట్టే ఇంటింటి చెత్త సేకరణ ఛార్జీ కొన్ని కాలనీల్లో రూ. 50 ఉండగా..మరికొన్ని ప్రాంతాల్లో రూ. 100 నుంచి 150 వరకు ఉంది. అయినా ప్రతిరోజూ చెత్త సేకరణ జరగడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. చెత్త సేకరణణు మెరుగుపరచడంతోపాటు ఫీజును నియంత్రించడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.  

 జీహెచ్ఎంసీకి పలు విభాగాల నుంచి ఆదాయం వస్తుంది. వాటిని నిర్ధారించడంలో లోపాల  కారణంగా బల్దియా ఏటా కోట్ల రూపాయలు నష్టపోతుంది. నిర్మాణాలకు రూ. 1,200లోపు ఆస్తి పన్ను ఉంటే రూ. 101 మాత్రమే చెల్లిస్తే చాలంటూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో దుర్వినియోగం అవుతోంది. ఈ లోపాలను చక్కదిద్ది ఆదాయాన్ని పెంచుకోవాలని తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

ఇక జలమండలి తాగునీటికి ప్రతినెలా బిల్లులు ఎలా వసూలు చేస్తోంది. నెలకు 20వేల లీటర్ల తాగునీటిని ఉపయోగించుకునే ఇళ్లకు ఫ్రీగా మంచినీటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యుత్ కు సంబంధించి నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న ఇండ్లకు ఫ్రీ విద్యుత్ స్కీం అమలు చేస్తోంది.  

 ఇందుకు ప్రతినెల కరెంటు బిల్లు వస్తోంది. పైపు లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసినా నెలవారీగా వసూలు చేయవచ్చని బల్దియా ఆలోచిసోతోంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతోంది చూడాలి. ప్రతినెల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link