Reliance Electric Cars: త్వరలోనే మార్కెట్లోకి రిలయన్స్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లోయింగే

Sat, 07 Sep 2024-1:14 pm,

Anil Ambani Electric Cars: ఒకప్పుడు వెలుగు వెలిగి ప్రస్తుతం దివాలా అంచులకు చేరిన అనిల్ అంబానీ ఈసారి సరికొత్త వ్యాపారం ద్వారా మార్కెట్లో సంచలనం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.   

ఇందులో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బివైడి భారత విభాగం మాజీ ఎండి సంజయ్ గోపాలకృష్ణన్ ను సలహాదారుగా నియమించుకుంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు అనిల్ అంబానీ సన్నద్ధం అవుతున్నారు.  

ఇప్పటికే ఈ రంగంలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది టాటా మోటార్స్ నుంచి పలు రకాల కార్లు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విడుదలై మార్కెట్లో మంచి సేల్స్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా నుంచి కూడా సరికొత్త కారు వస్తున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లను ఢీకొట్టేలా ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఒక కొత్త ప్లాంట్ ను స్థాపించాలని రిలయన్స్ ఇన్ఫ్రా భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

నూతన ప్లాంట్ సామర్థ్యం సంవత్సరానికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి చేయడంతో పాటు పది గీగావాట్ల గంటల సామర్థ్యంతో బ్యాటరీ తయారీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సామర్థ్యాన్ని ప్రతి సంవత్సరం పెంచుకునేలా ప్లాన్ రూపొందించనున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ నుంచి కనీసం సంవత్సరానికి 7.5 లక్షల కార్ల ఉత్పత్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు.   

ఇక రిలయన్స్ కారు విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కన్నా తక్కువ ధర ఉండేలా ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టెలికాం రంగంలో కూడా రిలయన్స్ ఇలాంటి స్టాటజీనే అప్లై చేసింది.  

ఇదిలా ఉంటే అనిల్  అంబానీ సోదరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ తయారీ విభాగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమం కింద పది గీగా వాట్ల సామర్థ్యం గల అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల తయారీకి ఒక కొత్త పరిశ్రమను స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన అనుమతి పొంది ఉన్నారు. అయితే ఈ నూతన బ్యాటరీ విధానం సరికొత్త సాంకేతికతను పరిచయం చేయనుంది. ఇందులో పవర్ బ్యాకప్ ఎక్కువగా ఉండేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తోంది. అలాగే అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు సూట్ అయ్యేలా ఈ వాహన బ్యాటరీలను తయారు చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link