Laziest Countries: బద్దకం వారి బ్లడ్‌లోనే ఉంది.. ప్రపంచంలో అత్యంత బద్దకపు దేశాలు ఇవే!
Laziest Countries: ప్రపంచంలోని అత్యంత బద్దకపు దేశాల జాబితాను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తాను చేసిన అధ్యయనంలో వెలువడిన జాబితాలో ఉన్న దేశాలు ఇవే.
ఇండోనేషియా || Laziest Countries: సోమరితనం అధికంగా ఉన్న మొదటి దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఇక్కడి ప్రజలు బద్దకంగా ఉంటారని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం తన నివేదికలో చెప్పింది. అధ్యయనం ప్రకారం ఇండోనేషియా ప్రజలు రోజుకు సగటున 3,513 అడుగులు మాత్రమే వేస్తారంట.
సౌదీ అరేబియా || Laziest Countries: సోమరిపు దేశాలలో సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రజలు రోజుకు సగటున 3,807 అడుగులు వేస్తారు.
మలేషియా Laziest Countries: ప్రపంచంలోని సోమరితనం దేశాలలో మలేషియా మూడో స్థానంలో ఉంది. సగటున రోజుకు 3,963 అడుగులు వేస్తారు.
ఫిలిప్పీన్స్ || Laziest Countries: యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఫిలిప్పీన్స్ రోజుకు సగటున 4,008 అడుగులు వేస్తారు. ఈ దేశం 4వ స్థానంలో ఉంది.
దక్షిణాఫ్రికా || Laziest Countries: రోజుకు సగటున 4,105 అడుగులు వేసే దక్షిణాఫ్రికా 5వ స్థానంలో ఉంది.
ఈజిప్ట్| Laziest Countries: సోమరితనం ఉన్న దేశాలలో ఈజిప్ట్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు రోజుకు సగటున 4,315 అడుగులు వేస్తారు.