Cholesterol: ఈ టీ కొలెస్ట్రాల్‌ను ఇట్టే తగ్గిస్తుంది.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Sun, 15 Sep 2024-9:28 pm,

పసుపు టీ.. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ని తగ్గించేస్తాయి శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ తో స్థాయిలను పెంచుతాయి. పసుపుతో టీ తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ప్రతిరోజు ఒక కప్పు పసుపు టీ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

వెల్లుల్లి టీ... వెల్లుల్లితో తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది సీజనల్ వ్యాధుల దరిచేరకుండా కాపాడి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది.

మునగాకు టీ.. మునగాకులకు కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. దీంతో లెక్కలేనని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఈ మునగాకుతో తయారు చేసుకొని తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.

ధనియాల టీ.. ధనియాల మీ డైట్ లో చేసుకోవడం వల్లనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇది హైపర్ టెన్షన్ సమస్యను కూడా తగ్గిస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని నివారిస్తుంది.

పుదీనా టీ.. పుదీనాలో కూడా ఔషధ గానాలు గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి రిఫ్రెష్మెంట్ అందిస్తుంది చెడు కొలెస్ట్రాల్ నివారిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల అదుపులో ఉండేలా ప్రేరేపిస్తుంది పదునుతో తయారు చేసుకున్న టీ ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇస్తుంది పుదీనా నీళ్లు తేనె కలిపి తీసుకోవాలి.

మెడికల్ న్యూస్ టుడే ప్రకారం కొన్ని రకాల హెర్బల్ టీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.  

అయితే ఏ ఆహార పదార్థాలైనా మీ డైట్ లో చేర్చుకుంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ కూడా యాక్టివ్ గా ఉండాలి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో తగ్గిపోతాయి. అంతేకాదు వైద్యులను సంప్రదించి తీసుకోవటం మేలు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link