Erectile Dysfunction: ఈ అలవాట్లు ఉన్నాయా? అంగస్తంభన సమస్య వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!
ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల నపుంసకత్వం కూడా పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.
ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా నపుంసకత్వం పెరుగుతుంది, శరీరం ఎక్కువగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నప్పుడు లైంగిక సామర్థ్యంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా.
మద్యం సేవించడం వల్ల నపుంసకత్వం పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.
పొగాకులో ఉండే నికోటిన్ నపుంసకత్వాన్ని పెంచుతుంది. పొగాకు వినియోగం వల్ల పురుషుల వీర్యం నేరుగా దెబ్బతిని వారిని నపుంసకుడిని చేస్తుంది.
శారీరక వ్యాయామం లేకపోవడం కూడా నపుంసకత్వాన్ని పెంచుతుంది. యోగా సహా ఇతర వ్యాయామాల ద్వారా శారీరక వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.