Airplane Travel Tips: ఈ వస్తువులను పొరపాటున విమానాల్లో తీసుకెళ్లకూడదు... ఎందుకో తెలుసా?
ఎయిర్ పోర్ట్‌లోనే విస్త్రత తనిఖీలు చేసే ఆనవాయితీ ఎయిర్ పోర్టులో ఉంటుంది. అయితే, కొన్ని నిబంధనాల ప్రకారం విమానంలో మీరు ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు కొన్ని రకాల వస్తువులను మాత్రం మీతోపాటు ఎప్పుడూ తీసుకు వెళ్లకూడదు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
కొన్ని రకాల వస్తువులు తీసుకువెళ్లడం వల్ల ప్రయాణీకులకు కూడా ఇబ్బంది. చెకింగ్ వంటివి చేసేటప్పుడు ప్రయాణం కూడా ఆలస్యం కావచ్చు. అందుకే మీరు కూడా విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులు మీతోపాటు తీసుకువెళ్లకూడదు.
ఎండు కొబ్బరి మీ బ్యాగేజీలో తీసుకుని వెళ్లకూడదు ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది. మండే స్వభావం కూడా కలిగి ఉంటుంది.
లైటర్లు, ఇ సిగరెట్లు, గ్యాస్ క్యాట్రిడ్జ్ వంటివి కూడా విమాన ప్రయాణంలో తమతోపాటు తీసుకువెళ్లకూడదు
థర్మోమీటర్ వంటివి కూడా తమతోపాటు తీసుకువెళ్లకూడదు. ఇందులో ఉండే పాదారసం వల్ల కూడా విమాన ప్రయాణానికి ప్రమాదం.
బ్యాటరీ పవర్ వీల్ అడాప్టర్లు వంటివి తీసుకు వెళ్లకూడదు. ఇందులో యాసిడ్ ఉంటుంది. అంతేకాదు లిథియం మెటల్, లిథియం అయాన్ సెల్, పవర్ బ్యాంకులు, బ్యాటరీలు వంటివి కూడా తమతోపాటు తీసుకువెళ్లకూడదు.