Weight loss: వంటలో ఈ చిన్ని మార్పు చేస్తే త్వరగా బరువు తగ్గడం ఖాయం..!

ఎంతోమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. మనం తినే ఆహారం మితంగా తీసుకోవడం.

మితంగా తీసుకోవాలి అనుకున్న సరే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు.. మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తింటూ ఉంటాం.

అందుకే మీ వంటల్లో ఈ చిన్ని మార్పులు చేసుకుంటే చాలు మీరు బరువు తగ్గడం ఖాయం. మీరు చేయాల్సిందల్లా.. మీరు వంట చేసుకునేటప్పుడు ప్రతిరోజు కచ్చితంగా ఒక వెజిటేబుల్ ఫ్రై చేసుకోండి.
దీంతోపాటు రసం లేదా పప్పు చేసుకోండి. రసం, పప్పు రెండు మాత్రం ఒకేరోజు చేసుకోవద్దండి .
ఎక్కువ రకాలు కూరలు ఉండడం వల్ల.. మనం తప్పకుండా అన్ని తినడానికి ప్రయత్నిస్తాం.
అలాకాకుండా ఇలా కేవలం ఏదైనా ఒక్క కూర చేసుకుంటే. మనం భోజనం మితంగా తీసుకోవడం ఖాయం.
అందులో పక్కన వెజిటేబుల్ ఫ్రై ఉంటే దాని ద్వారా కూడా మన కడుపు ఎక్కువగా నిండుతుంది. అలా అని పెరుగు బదులు మజ్జిగ చేసుకొని తినండి. అంతేకాకుండా బయట ఫుడ్ పూర్తిగా తినకుండా ఉండండి. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు మీరు బరువు తగ్గటం ఖాయం.