Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

Sun, 12 May 2024-1:01 pm,

మనలో ప్రతిఒక్కరు పాములంటే భయంతో వణికిపోతారు. పొరపాటున పాములు ఎక్కడైన కన్పిస్తే ఆ ప్రదేశానికి అస్సలు వెళ్లరు. చెట్లు, గుట్టలు, అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా ఉంటాయి. పాములు కొన్నిసార్లు మన ఇళ్లకు వస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు

మరికొందరు పాముల్ని చంపుతుంటారు. చంపిన పాముల్ని తీసుకుని డాక్టర్ దగ్గరకు ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్తుంటారు. కొన్నిసార్లు అదే పాముల కాటుకు గురై చనిపోవడం కూడా జరుగుతుంది.  పాముల్ని మనలో చాలా మంది దేవుడిగా కొలుస్తారు. పాములకు అపకారం చేస్తే దోషాలు చుట్టుకుంటాయని భావిస్తారు.  

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల రకాల పాములు ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరీతమైనవి కాగా, మరికొన్ని విషంలేనివి కూడా ఉన్నాయి. కాలనాగు, నాగుపాటు, బ్లాక్ కోబ్రా, బ్లాక్ మాంబా, నల్ల త్రాచు మొదలైన పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటేసిందంటే నిముషాల్లో మనిషి మరణిస్తాడు.  

కొన్నిపాములు వెరైటీ ప్రవర్తిస్తుంటాయి. గాల్లో ఒక చెట్టునుంచి మరోక చెట్టు మీదకు కూడా ఎగిరే పాములు ఉంటాయి. ర్యాటిల్ స్నేక్ లు ముఖ్యంగా తోక భాగంతో చప్పుడు చేస్తు ఉంటాయి. అది ఎరను డైవర్ట్ చేసి, దానిపై దాడిచేసి తినేస్తుంది. అయితే.. ప్రస్తుతం ఒక వెరైటీ పాము వార్తలలో నిలిచింది  

నాట్రిక్స్ టెస్సెల్లాట అనే పాము  ఎదుటి వాళ్లను బురిడి కొట్టిస్తుందంట. దీనిపైన ఏదైన పాము లేదా ఎర దీని దగ్గరకు వస్తే చనిపోయినట్లు నటిస్తుందంట. ఎలా అంటే భయంకరంగా రక్తంను వామిటింగ్ చేసుకుంటుందంట. అంతేకాకుండా.. మలంను, భయంకరమైన ద్రావణంను శరీరం నుంచి రిలీజ్ చేస్తుందంట.  

పొరపాటున ఇది నిజమనుకొని ఏదైన జంతువు,ఎర దీని దగ్గరకు వెళ్లగానే దానిపైకి దాడిచేస్తుందంట. ఇలా ఇది వేరే ఎరలపై దాడిచేసి తినేస్తుందంట. ఈ పాములను పాచీక పాములు అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా యూరప్, ఆసియాలోని కొన్ని దేశాలలో చాలా అరుదుగా కన్పిస్తాయంట.  

ఈ పాములు దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయంట. బయోలజికల్ లెటర్స్ లో సైంటిస్టులు ఇటీవల డైస్ స్నేక్ గురించి ఆసక్తికరమైన అనేక అంశాలను గురించి ప్రచురించారు. వీరు దాదాపు 263 రకాల డైస్ పాములపై పరిశోధలను చేశారంట. వీటిలో చాలా పాములు ఇదే విధంగా చనిపోయినట్లు నటించినట్లు గుర్తించారు.   

తమకు అపాయం కల్గిందని భావించినకూడా ఈ పాములు చనిపోయినట్లు నటిస్తాయంట. ఇలా దాదాపు పదినిముషాల వరకు పూర్తిగా అచేతనంగా ఉంటాయంట.  ప్రస్తుతం డైస్ స్నేక్ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link