OTT Movies: `దేవర` టికెట్లు దొరకలేదా.. అయితే ఈవారం ఓటీటీలో భారీ సినిమాలు చూసేయండి

ఈ వారం ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నాయి.

ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు సిద్ధమైపోండి. థియేటర్‌లో దేవర సినిమా వస్తుండగా దానికి పోటీగా ఓటీటీలో భారీ సినిమాలు వస్తున్నాయి.

సరిపోదా శనివారం: ఆగస్టు 29వ తేదీన థియేటర్‌లలో విడుదలైన మంచి విజయాన్నందుకున్న సరిపోదా శనివారం ఓటీటీలోకి రానున్నది. సెప్టెంబర్ 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ప్రతినిధి 2: ఎన్నికల ముందు విడుదలైన ప్రతినిధి 2 సినిమా తాజాగా బుల్లితెరపై రానుంది. నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఆహాలో సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది.
కిల్: ఇక డబ్బింగ్ సినిమాల్లో కిల్ అతి పెద్ద సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. 2023లో విడుదలైన ఈ సినిమా తెలుగులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రసారం చేస్తోంది.
సోపతులు: ఇక ఈటీవీ విన్ యాప్‌లో సోపతులు అనే అచ్చమైన తెలంగాణ పల్లెతనంతో కూడిన సినిమా స్ట్రీమ్ అవుతోంది. నైంటీస్ కిడ్స్ తర్వాత మళ్లీ అంతటి ఆసక్తితో ఇది విడుదలైంది.
స్త్రీ 2: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన స్త్రీ 2 అప్పుడే ఓటీటీలోకి వస్తోందని పుకార్లు వస్తున్నాయి. అకస్మాత్తుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుందని ప్రచారం సాగుతోంది.