Rasi Phalalu: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11 వరుకు వార ఫలాలు..ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Mon, 05 Feb 2024-10:16 am,

2024వ సంవత్సరంలోని ఫిబ్రవరి నెల రెండో వారం ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈరోజు సోమవారం ఫిబ్రవరి 5వ తేదీ..అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా జాతకాలను గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉండబోతోంది.  

ఈ ఫిబ్రవరి రెండో వారంలో కర్కాటక రాశితో పాటు మరికొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ వారంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా ఈ రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. 

కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆస్తులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ వారంలో పిల్లలతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ జీవితంలో వస్తున్న చిక్కులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ ఫిబ్రవరి రెండో వారం అనుకున్న లాభాలు అందించబోతోంది.  

వృషభ రాశి వారికి కూడా ఫిబ్రవరి రెండో వారంలో జరిగే గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. దీని కారణంగా వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. దీంతో పాటు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాల కోసం ఇతర దేశాలు వెళ్లే అవకాశాలున్నాయి.  

మిథున రాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. ఈ సమయంలో వీరికి వ్యాపారంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి.. పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వీరు కూడా వ్యాపారాల కోసం విదేశాలకు ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరి రెండో వారంలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారిలో కుంభ రాశి వారు ఒకరు. వీరు ఈ సమయంలో వ్యాపారాలు ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు.

ఫిబ్రవరి రెండో వారంలో తులారాశి వారు కూడా ఊహించని లాభాలు పొందబోతున్నారు. గ్రహాల సంచారాల కారణంగా ఏర్పడబోయే ప్రభావం ఈ రాశి వారిపై కూడా పడబోతోంది. దీనికి కారణంగా వ్యాపారాలు వృత్తిపరమైన జీవితంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీంతోపాటు వీరికి ప్రేమ సంబంధాలు కూడా మెరుగుపడతాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link