Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే.. శీఘ్రంగా పెళ్లి యోగం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్..
ఆషాడమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అనిపిలుస్తారు. దీన్నే దేవ్ శయనీ ఏకాదశి అనికూడా పిలుస్తుంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభమౌతుంది . ఈరోజున చాలా మంది ఉపవాసాలు చేస్తారు.
తొలి ఏకాదశి రోజున చాలా మంది పండరీపూరం యాత్రలకు వెళ్తారు. ముఖ్యంగా వార్కరీలు పండరీపురంకు యాత్రగా..వెళ్తుంటారు. అదే విధంగా.. ఏకాదశిరోజున హిందువులంతా ఎంతో పవిత్రమైన నియమాలను పాటిస్తుంటారు. ఈరోజున ఏ చిన్న పూజ, ఉపవాసం,నియమం, వ్రతం చేసిన కూడా అది వెయ్యిరెట్లు ఫలితం ఇస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
దేవ్ శయనీ ఏకాదశిరోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేయాలి. అంతేకాకుండా.. భక్తితో దేవుడి పూజగదిని శుభ్రం చేసి, పూలు, పండ్లు, రెడీ పెట్టుకొవాలి. పూజలు చేసి, నైవేద్యం సమర్పించాలి. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి.. ఆయనకుఅనేక రకాల పూలు, పండ్లను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి కోరికలన్ని నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు.
ముఖ్యంగా పెళ్లి కానీ వారు.. ఈరోజున రుక్మిణి కళ్యాణంను 11 సార్లు చదివితే..నెల తిరక్కుండానే పెళ్లి సెటిల్ అవుతుందని చెబుతుంటారు.అదే విధంగా సత్యానారాయణ స్వామి వ్రతం చేసిన కూడా అంటుకున్నదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతుంటారు. అందుకే ఈరోజున ఉపవాసం చేయాలి.
అదే విధంగా ఈరోజున పేదలకు ఏదైన దానధర్మాలు చేయాలి. వస్త్రదానం, వారి అవసరాలకు ఏదైన డబ్బుల సహాయంచేయాలి. పేదలు పెళ్లిళ్లు జరిపుకునే టప్పుడు తోచిన విధంగా వారికి సహాయం చేస్తే కూడా జీవితలో అన్నపానాదులకు లోటు ఉండదని పండితులు చెబుతుంటారు. ఏకాదశి రోజున నెమలి ఫించమ్ ను ఇంటికి తీసుకొచ్చి పూజించుకొవాలి. లాకర్ లో పెట్టుకుంటే డబ్బులకు ఎన్నటికి కూడా లోటు ఉండదు.
ఏకాదశి రోజున గోశాలకు వెళ్లాలి. అక్కడ ఆవులకు గ్రాసంను వేయాలి. అదే విధంగా గాయపడిన ఆవులకు సపర్యలు చేయాలి. రోడ్లుమీద సంచరించే కుక్కలు, ఆవులు, మూగ జీవాలకు ఏదైన తినడానికి పెడితే.. మీ జాతకంలోని దోషాలన్ని పోయి పెళ్లి, సంపద వస్తాయని పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)