Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. దూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు పరితపిస్తుంటారు.
శ్రీవారికి కంటి నిండా చూసుకునేందుకు తెగ తాపత్రాయపడుతుంటారు. తిరుమలు చిన్న,పెద్ద, వృద్దులు అని తేడాలేకుంండా స్వామి దర్శనం కోసం క్యూలు కడుతుంటారు.
టీటీడీ కూడా స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. టీటీడీ ఇటీవల మాత్రం శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంతో వచ్చే భక్తులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
60 ఏళ్లు దాటిన వయో వృద్దులు, మధుమేహాం, గుండెనొప్పి, బీపీలు వంటి సమస్యలతో ఉన్నవారు మెట్ల మార్గంలో రావడం మానుకొవాలని టీటీడీ సూచించింది.
అంతే కాకుండా.. దీర్ఘకాలిక వ్యాధులతోబాధపడుతున్నవారు, ఉబ్బసం, మూర్ఛ వంటి సమస్యలున్న వారు మెట్ల మార్గంలో కాకుండా.. నేరుగా ఆలయంకు మరో మార్గంలో రావాలని కూడా టీటీడీ సూచనలు చేసింది.
కాలి నడకన వచ్చే భక్తులకు ఏదై సమస్యలుంటే.. అలిపిరి మార్గంలో 1500 మెట్లు, గాలి గోపురం, బ్యాష్య కార్ల సన్నిధిల వద్ద వైద్య సదుపాయం రెడీగా ఉంచినట్లు టీటీడీ తెలిపింది.
దీనితోపాటు, తిరుమలలో అశ్వినీ ఆస్పత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటల పాటు కూడా వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని కూడా టీటీడీ వెల్లడించింది.
భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. తాము అప్రమత్తంగా ఉంటున్నామని, పై విధంగా కొన్ని సూచనలు పాటిస్తే.. భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకొవచ్చని కూడా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.