Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..
ఈ నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం వృద్ధుల దర్శనానికి సంబంధించిన అసత్య ప్రచారాలను నమ్మవద్దని నేడు ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ విషయంపై అనేకమార్లు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రకటన చేసింది.
సోషల్ మీడియాలో తిరుమల దర్శనానికి సంబంధించిన అసత్య వార్తలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పింది. ముఖ్యంగా వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన వార్తలను ఏమాత్రం నమ్మకూడదని చెప్పారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ, అవన్ని పూర్తిగా అసత్యం అని నేడు అధికారికంగా ప్రకటించింది. ప్రతినెల 23వ తేదీ వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం వెయ్యి టిక్కెట్లను మూడు నెలలు ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపింది.
అంతేకాదు ఇలా ఆన్‌లైన్ టిక్కెట్ దర్శనంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ. 50 ఉచిత లడ్డూను కూడా అందిస్తుందని చెప్పింది. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి నంబి ఆలయం వద్ద ఉన్న సీనియర్ సిటిజెన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ సందర్భంగా వృద్ధులకు సంబంధించిన దర్శనాలపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఏదైనా సమాచారం కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.Tirumala.org, Https://ttdevstanams.ap.in ద్వారా మాత్రమే సంప్రదించాలని టీటీడీ యంత్రాంగం భక్తులను కోరింది.