Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

Sun, 10 Nov 2024-2:40 pm,

కలియుగ దైవం వేంకటేశుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శ్రీహరి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తిరుమల దేవస్థానం ప్రతిరోజు కొన్ని వేల మంది  స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం నడక మార్గంలో కూడా భక్తులు చేరుకుంటారు. తిరుమల శ్రీ వేంకటేశునితోపాటు పద్మావతి, అలివేలుమంగ అమ్మవారిని దర్శించుకుంటారు.  

అయితే నిన్న శనివారం వీకెండ్ కావడంతో స్వామివారిని 73,500 మంది దర్శించుకున్నారు. 9వ తేదీ శనివారం మరుసటి రోజు ఆదివారం రావడంతో ఈ సంఖ్య కాస్త పెరిగింది. మొన్నటి వరకు పండుగల సందర్భంగా సాధారణ రద్దీ కనిపించింది. అయితే, వీకెండ్ రావడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కొన్ని ఆఫీసులకు సెలవులు వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వీకెండ్‌ లో దర్శనానికి ఎక్కువ మంది భక్తులు చేరుకుంటారు.  

తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడానికి రూ.300 ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులతోపాటు, సర్వదర్శనానికి ఎదురు చూసిన కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏ ఇబ్బందులు కాకుండా టీటీడీ యంత్రాంగం భోజనం, నీటి సదుపాయాలను కూడా వారికి కల్పించారు. నడక మార్గంలో వచ్చే భక్తులకు కూడా ఈ సదుపాయాలు ఉంటాయి.  

అయితే నిన్న శనివారం సందర్భంగా శ్రీవారికి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చింది. ఇక మొత్తంగా 32,600 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల అధికారిక యంత్రాంగం తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న సర్వ దర్శనానికి ఎదురు చూసిన భక్తులకు 8 గంటల సమయం పట్టింది. 25 కంపార్ట్‌మెంట్లలో  కిటకిటలాడాయి. అయితే స్వామివారి దర్శనార్థం ప్రతి మూడు నెలలకు ముందుగానే ఈ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. భక్తులు ముందుగానే బుక్‌ చేసుకోవాలి.  

ఇక టైమ్‌ స్లాట్‌ భక్తులతో మొత్తంగా పది కంపార్ట్మెంట్లో స్వామి వారి దర్శనార్ధం ఎదురు చూడగా, వీళ్లకి స్వామి వారినికి దర్శించుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారిని దర్శనం కలుగాలని ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తారు. ప్రతిరోజూ స్వామివారికి రకరకాల సేవలు అందిస్తారు. స్వామి వారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో కనుల పండువగా కనిపిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link