Tirumala Laddu: తిరుమల లడ్డులో పందికొవ్వు, చేపనూనె... ల్యాబ్ రిపోర్టును బైటపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. వివరాలివే..
తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలాంటి తిరుమల లడ్డు గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. మరోవైపు భక్తుల మనోభావాలు కూడా ఆందోళనకు గురయ్యే విషయం అనిచెప్పవచ్చు.
చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. గత వైసీపీ సర్కారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వులను ఉపయోగించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కారు తిరుమల పవిత్రను అత్యంత దిగజార్చాడంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటి నుంచి ఒక్కసారిగా రాజకీయంగా దుమారంగా మారింది. దీనిపైన వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.
ఈ క్రమంలో.. తిరుమల లడ్డు నాణ్యతపై..అనేక ఫిర్యాదులు అందడంతో.. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.
వైసీపీ సర్కారు హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు కూడా బైటపడింది. ముఖ్యంగా.. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బైటపడింది.
దీనితో పాటు చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. ఈక్రమంలో.. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ జగన్ సర్కారు బండారం బట్టబయలైనట్లైందని తెలుస్తోంది. అదే విధంగా నెయ్యి కోనుగోళ్ల విషయంలో వైసీపీ సర్కారు నాణ్యతను పాటించలేదని దీంతో నిరూపితమైందని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి మొదలు పెడితే.. నిత్యాన్న ప్రసాదంలో ఉపయోగించే అన్నిరకాల నిత్యవసరాల వస్తువులను వైసీపీ.. సర్వనాశనం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో.. జంతువుల కొవ్వును కలిపారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.