Chandrababu: తిరుపతి తొక్కిసలాట బాధితులను చూసి చంద్రబాబు భావోద్వేగం
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంఘటన జరిగిన తెల్లారి గురువారం తిరుపతిని సందర్శించారు.
బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల పక్కన మునిసిపల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు.
తిరుపతి తొక్కిసలాట ప్రమాద ఘటనపై పరిశీలిస్తూ అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. క్యూ లైన్లు, దర్శన ఏర్పాట్లను పరిశీలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
సీఎం వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈఓ తదితరులు ఉన్నారు.
కాగా మృతుల కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.25 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే వారికి నగదు సహాయం అందించనున్నారు.