Today Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర .. తులం పసిడి ధర ఎంతంటే?
Today Gold Price Rate : ఆగస్టు 28, 2024, బుధవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది, హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 73, 100గా ఉంది. అదే సమయంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66, 940గా ఉంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.1100 పెరిగింది.
పన్నులు ఎక్సైజ్ సుంకాల కారణంగా బంగారం వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అయితే ఏపీలో బంగారం ధరలో స్వల్పంగా మార్పులు వచ్చాయి. విజయవాడ, వైజాగ్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ప్రస్తుత ధర రూ.73,140 వద్ద ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,970 గా ఉంది.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందంటూ, వెలువడుతున్న వార్తల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు చైనా కూడా విపరీతంగా బంగారం కొనుగోలు చేయడం వల్ల పసిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. బంగారం ధరలు దేశీయంగా అతి త్వరలోనే 75 వేల రూపాయల మార్కును దాటే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా హాల్ మార్క్ ద్వారా నిర్ణయిస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది.
బంగారు ఆభరణాలు 22 క్యారెట్లలో అమ్ముడవుతాయి. కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. బంగారం 24 క్యారెట్లకు మించదని గమనించండి. క్యారెట్ ఎక్కువ ఉంటే అది స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది.
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలతో కలిపితే, 24 క్యారెట్ల బంగారం నాణ్యమైనది. కానీ దాని నుండి నగలు చేయలేము. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లకు విక్రయిస్తారు.