Rakul Preet Singh: వైరల్ పిక్స్.. మరోసారి రకుల్ ప్రీత్ అందాల విందు!!
రకుల్ ప్రీత్ తాజాగా ఓ ఫోటో షూట్ చేశారు. అందులో అందాల ప్రదర్శన చేశారు. 'నేను భూమి మీద ఉన్నాను బడ్డీ.. మరి మీరు' అంటూ కాప్షన్ ఇచ్చారు.
రకుల్ ప్రీత్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి తాజాగా ఢిల్లీలో ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సమయంలో తాజ్ మహల్ వద్ద సందడి చేశారు.
తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'కొండపొలం' సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌పై కన్నేశారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన 4-5 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ హవా కాస్త తగ్గిపోయింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ ,సాయి పల్లవి లాంటి హీరోయిన్లు సత్తాచాటుతుండడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్, విన్నర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా మారారు.