Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1

Sat, 03 Aug 2024-3:32 pm,

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తొలిసారి ‘జల్సా’ మూవీతో తొలిసారి కలిసి పనిచేసారు. వీళ్లిద్దరి మనస్తత్వాలు కలవడంతో  అది స్నేహంగా బలపడింది. 

మోహన్ బాబు - రజినీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు స్టార్ హీరో మోహన్ బాబు మంచి స్నేహితులు. తొలిసారి వీళ్లిద్దరు కలిసి నటించినపుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

బాలకృష్ణ - కిరణ్ కుమార్ రెడ్డి: నందమూరి నట సింహం, ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య కాలేజీ రోజుల నుంచి మంచి స్నేహమే ఉంది.

చిరంజీవి - నాగార్జున: చిరంజీవి, నాగార్జున మధ్య ఎంతో మంచి అనబంధం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

మహేష్ బాబు - సుమంత్: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, సుమంత్ మధ్య స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ అది పదిలంగా ఉంది.

 

రవితేజ - పూరీ జగన్నాథ్: రవితేజ, పూరీ జగన్నాథ్ ఇద్దరు సినీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యేటప్పటి నుంచి మంచి స్నేహుతులు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

 

త్రివిక్రమ్ - సునీల్: సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే త్రివిక్రమ్, సునీల్ మధ్య మంచి అనుబంధమే ఉంది.

ప్రభాస్ - గోపిచంద్: వర్షం సినిమా నుంచి ప్రభాస్, గోపీచంద్ ల మధ్య స్నేహం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధమే ఏర్పడింది.

ప్రభాస్ - అల్లు అర్జున్: ప్రభాస్ , అల్లు అర్జున్ మధ్య కూడా మంచి స్నేహ బంధమే ఉంది. బయట కనపడకపోయినా.. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link