Pooja Hegde Cute Pics: శ్రీలంకలో పూజా హెగ్డే.. క్యూట్ క్యూట్‌గా బుట్టబొమ్మ!

Fri, 28 Apr 2023-11:53 pm,

పూజా హెగ్దే తాజాగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడి హోటల్లో బుట్టబొమ్మ సందడి చేశారు. పూజా క్యూట్ క్యూట్‌ లుక్స్ వైరల్ అవుతున్నాయి.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నెట్టింట బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

పూజా హెగ్డే చివరగా నటించిన 2-3 సినిమాలు సరిగా ఆడలేదు. వరుస డిజాస్టర్స్ పడినా పూజా క్రేజ్ మాత్రం తగ్గలేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తున్నారు. తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు.   

ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ అయ్యారు.   

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2014లో వచ్చిన 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  

1990 అక్టోబరు 13న ముంబైలో పూజా హెగ్డే జన్మించారు. శ్రీమతి ఎంఎంకే కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన పూజా.. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link